హస్తినలో రెజ్లర్లు చేస్తున్న నిరసనపై స్పందించిన అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ....
పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ అటుగా మార్చ్ చేపట్టిన రెజ్లర్లను నిర్భందించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల....

మన దేశ రాజధాని ఢిల్లీ లో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తమపై లైంగిక వేధింపులు జరిగాయనీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,చర్యలు తీసుకోవాలని గత కొద్దికాలంగా మొక్కవోని దీక్షతో ,దృడ సంకల్పంతో,కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో ఆటంకాలు,అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ లెక్క చెయ్యకుండా ఇప్పటికీ ఇంకా తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి,లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బిజేపి ఎంపీ డబ్లుఎఫ్ఐ అధ్యక్షులు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు అండగా ఉన్నారనే ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనపై స్పందించి మాకు న్యాయం చేయాలని రెజ్లర్లు కన్నీటిపర్యంతమవుతూ నిన్న తీవ్ర నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
కేంద్రం స్పందించినందుకు నిరసనగా తాము మన దేశంకోసం సాధించిన గొప్ప పథకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకున్నారు.ఆ ప్రాంతంలో సుమారుగా ఇరవై నిమిషాలు పాటు మౌనదీక్ష చేశారు.తదనంతరం గంగా నది ఒడ్డుకు చేరుకొని పతాకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు.దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా గొప్ప పథకాలను సాధించి ఇప్పుడు ఈ పథకాలను గంగలో నిమజ్జనం చేయాల్సి వస్తోందంటు రెజ్లర్లు కన్నీరుమున్నీరు అయ్యారు.అయితే చివరి క్షణంలో ఖాప్ మరియు రైతు సంఘాల నేతలు వారిని వారిస్తు కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువు ఇద్దామని ప్రతిపాదన చేయడంతో రెజ్లర్లు ఆగిపోయారు.కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని ,ఆలోపు చర్యలు తీసుకోకపోతే మాత్రం పథకాలు గంగలో కలిపేస్తాం అని స్పష్టం చేశారు.
గత కొద్ది రోజుల నుండి అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ రెజ్లర్ల ఆందోళనను,నిరసన కార్యక్రమాలను గమనిస్తున్నాం అంటూ రెజ్లర్ల భద్రత, నిష్పాక్షిత దర్యాప్తు నిర్ధారించేందుకు మరోసారి మేము సమావేశం నిర్వహించనున్నామని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. రెజ్లర్లు చేస్తున్న నిరసనపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం వేళ రెజ్లర్లు తమ నిరసనను తెలియజేయడానికి అటుగా మార్చ్ చేపట్టిన సందర్భంగా వారిని నిర్బందించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.రెజ్లింగ్ సమాఖ్య కు నలభై ఐదు రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే సస్పెన్షన్ ను ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రెజ్లర్లతో వ్యవహరించిన తీరు,వారి నిర్బంధాన్ని ఖండిస్తున్నాం మరియు లైంగిక వేధింపుల ఆరోపణలపై చేస్తున్న దర్యాప్తులో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని, రెజ్లర్లు చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ,ఒకవేళ నలభై ఐదురోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ తెలిపింది.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రెజ్లర్ల నిరసన,వారు చేస్తున్న ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరిపించి వారికి న్యాయం చేయాలని,అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ పూర్తి జోక్యం చేసుకోకముందే మన దేశ అగ్రశ్రేణి రెజ్లర్లకు అండగా నిలిచి కేంద్ర ప్రభుత్వం తమ తీరును మార్చుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయ మరియు తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీ ముందుకు ఇలా సందేశాల రూపంలో మా ఇంటెలిసెన్స్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా పొందుపర్చుతాము.వీక్షకులు మీ అభిప్రాయాలను మరియు మీ విలువైన సలహాలను & సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు....మీకు ప్రత్యేక ధన్యవాదాలు........